Cinema: శ్రీకళాసుధ ఉగాది పురస్కారాలు

X
By - Chitralekha |24 March 2023 3:59 PM IST
నందమూరి కళ్యాణ్ రామ్ కు శ్రీకళాసుధ ఉత్తమ నటుడి ఉగాది పురస్కారం
శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ లొ వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. నటీమణి ఈశ్వరీరావుకు బాపూబొమ్మ పురస్కారాన్ని అందించారు. బాపూరమణల పురస్కా రాన్ని సినీదర్శకుడు హను రాఘవపూడి, మహిళా రత్న పురస్కారాన్ని వైద్య రంగానికి చెందిన స్వర్ణలత, నృత్య కళాకారిణి మేనకా పిపి బోరా అందుకున్నారు. బింబిసార చిత్రానికి గానూ నందమూరి కల్యాణ్ రామ్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకోగా, సమంత ఉత్తమ నటి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఇక లతా మంగేష్కర్ పురస్కారాన్ని శ్రీలేఖ అందుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com