Cinema: ఇష్క్ రీ రిలీజ్.....

Cinema: ఇష్క్ రీ రిలీజ్.....
నితిన్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫ్యాన్స్ కు ట్రీట్

వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న సమయంలో ఇష్క్ మూవీ నితిన్ కెరీర్ కు మళ్లీ బ్రేక్ ను ఇచ్చింది. ఫ్లాప్ ట్రాక్ మీద ఉన్న అతని కెరీర్ ను తిరిగి సక్సెస్ వైపు నడిపించింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సినీ ప్రియులకు కూడా ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ముఖ్యంగా నితిన్, నిత్యామీనన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపాడేసిందనే చెప్పాలి. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం శ్రోతలను ఓలలాడించింది. పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. తాజాగా మార్చ్ 29న నితిన్ పుట్టిన రోజు పురస్కరించుకని ఇష్క్ మూవీని రీ రిలీజ్ చేసేందుకు దర్శక-నిర్మాతలు సమాయత్తం అవుతున్నారు. మరి ఇష్క్ మరోసారి మ్యాజిక్ ను రీ క్రియేట్ చేస్తుందేమో చూడాలి

Tags

Read MoreRead Less
Next Story