Cinema: భగభగమంటోన్న లారెన్స్

Cinema: భగభగమంటోన్న లారెన్స్
రుద్రుడిగా కనువిందు చేయబోతున్న రాఘవ లారెన్స్

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా మరో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. కథిరేశన్ దర్శకత్వంలో రుద్రన్ పేరిట తెరకెక్కతోన్న ఈ చిత్రం తెలుగులో రుద్రుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక కాంచన సిరీస్ తో టాప్ లీగ్ హీరోల్లో చేరిపోయిన లారెన్స్ రుద్రుడిగా మరో విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి భగభగరగలరా అనే సాంగ్ రీలీజ్ అవ్వగా దానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటకు హైలైట్ లారెన్స్ గెటప్ అని తెలుస్తూనే ఉంది. కాంచన సరీస్ మాదిరే ఇది కూడా ఓ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ గానే తెరకెక్కుతోందని చెబుతున్నారు. మరి లారెన్స్ ఈ సారి కూడా తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడేమో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story