Cinema: అరుదైన 'దహనం'

Cinema: అరుదైన దహనం
X
ఆదిత్య ఓం ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న దహనం

లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన ముంబై హీరో ఆదిత్య ఓం కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య మసాబ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి తనలోని మరో టాలెంట్ ను కూడా పరిచయం చేశాడు. తాజాగా ఆది మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. దహనం అనే సినిమాతో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఓపెన్ ఫీల్డ్ మీడియా పతాకంపై డాక్టర్- శ్రీపెతకంశెట్టి సతీష్ కుమార్ నిర్మాతగా ఆడారి మూర్తి సాయి గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అవ్వగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓ భైరాగి, పూజారి, ఊరి పెద్ద చుట్టూ జరిగే కథే దహనం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇక టీజర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన వైవీఎస్ చౌదరీ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక ఆదిత్య ఓం దహనం లాంటి సినిమాలు పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, అందరూ తప్పకుండా చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags

Next Story