Cinema: మాస్ మసాలా దట్టించిన 'మీటర్'

మాస్ హీరోగా రఫ్పాడించబోతున్న కిరణ్ అబ్బవరం
పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే తెలుగువారికి బాగా దగ్గరైపోయాడు కిరణ్ అబ్బవరం. ఇక వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద గ్యాప్ లేకుండా విజయఢంకా మోగిస్తున్న ఈ యంగ్ హీరో తాజాగా మీటర్ మూవీతో ప్రేక్షకుల మందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ తో ఈ సినిమాపైనా ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈరోజే ట్రైలర్ రిలీజ్ అవ్వగా సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ అని ఇట్టే అర్థమైపోతోంది. రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రమేశ్ కాడూరి దర్శకత్వం వహించారు. మరి ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోన్న మీటర్ ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story