Cinema: ధూంధాం..దసరా

నేచురల్ స్టార్ నాని దసరా థియేటర్లలో దుమ్మురేపుతోంది. సరికొత్త హిట్టు ఫార్ములా కనిపెట్టిన నానీ ఈసారి ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెప్పవచ్చు. ఇప్పటివరకూ ఒకటీ అరా తప్పినే లుక్స్ తో పెద్దగా ప్రయోగాలు చేయని నానీ, ఊరమాస్ లుక్స్ తో అదరగొట్టేశాడు. పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాలని కసితో ఉన్న నేచురల్ స్టార్ మాస్ ఎంట్రీ ఇచ్చి తన నటనను మరో రేంజ్‌కి తీసుకెళ్లిపోయాడు. ఈ దెబ్బకి రామ్ చరణ్ కి ‘రంగస్థలం, అల్లు అర్జున్ కి ‘పుష్ప‘ మాదిరి నాని కెరీర్ లో ‘దసరా‘ నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఆయన కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ధూంధాంగా అతి పెద్ద దావత్ ఇచ్చేశాడు. దీంతో అభిమానులు దసరా పండుగ చేసేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమాలో యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి నువ్వా..నేనా అనే రీతిలో నాని, కీర్తి పోటా పోటీగా నటించేశారు. సాఫ్ట్ రోల్స్ లో సరదాగా నటించి అలరించే మహానటి గుడ్ లక్ సఖీలో పల్లెటూరి గడుసరి అమ్మాయిలా అలరించిన విషయం తెలిసిందే ఈ చిత్రంతో అచ్చమైన తెలంగాణ మాస్ మహిళగా మరో మైల్ స్టోన్ చేరుకుంది. తన నటనతో ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలదనే విషయం మళ్లీ రుజువు చేసుకుంది అందాల కీర్తి. ఇక సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ప్రాణం పోశాడనే చెప్పాలి. తన అద్భుతమైన క్రియేషన్స్ తో ఆయన ఆవిష్కరించిన లోకంలో ఓ రెండు గంటల పాటూ బయట ప్రపంచాన్ని మరచిపోయి విహరించేంతగా సెట్స్ కు ప్రాణం పోశాడు. మ్యూజిక్ విషయానికొస్తే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకు ముందే విడుదలైన పాటలు ఏ రేంజ్‌లో జనాల్లోకి వెళ్లాయో తెలిసిందే. అయితే పాటలే కాకుండా ఆర్ ఆర్ కూడా సంతోష్ నారాయణ్ చాలా బాగా కంపోజ్ చేశాడు. చివరకు డైరెకక్షన్ విషయానికి వస్తే శ్రీకాంత్‌పై తన గురువు సుకుమార్ ప్రభావం స్పష్టంగా కినిపిస్తుంది అని చెప్పాలి. కానీ, డెబ్యూతోనే ఇండస్ట్రీపై తనదైనా మార్క్ వేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com