Cinema: ఆకట్టుకుంటోన్న బేబీ పాటలు
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరుగాంచిన ఎక్కేఎన్ నిర్మిస్తున్న బేబీ ప్రస్తుతం టిన్సెల్ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. రొటీన్ కు భిన్నమైన కథలను అందించే ఎస్కేఎన్ ఈసారి పూర్తిస్థాయి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి రాజేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటూ కథను కూడా తానే రాసుకోవడం విశేషం. ఇక విజయ్ బుల్గనిన్ స్వరాలు సమకూర్చిన పాటలు ఒక్కొక్కటిగా విడుదలవుతూ ప్రేక్షకులకు శ్రవణానందం కలిగిస్తున్నాయి. తాజాగా విడుదలైన దేవరాజా సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటోంది. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా, ఆర్యా దయాల్ హృద్యంగా ఆలపించారు. మరి పాటలతో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తోన్న బేబీ సక్సెఫుట్ నిర్మాత ఎస్కేఎన్ ఖాతాలో మరో హిట్ వేస్తుందోమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com