Cinema: శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Cinema: శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు
అందాల శ్రీవల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పుష్పా టీమ్

అందాల రష్మక మందన్న పుష్ప సక్సెస్ ను క్యాష్ చేసుకుంటూ నేషనల్ క్రష్ అని పిలిపించుకునే రేంజ్ కు రీచ్ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వరుసగా ఆఫర్లు అందిపుచ్చుకుంటోన్న రష్మిక, పుష్ప 2 షూటింగ్ లోనూ పాలుపంచుకుంటూ బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే నేడు అందాల శ్రీవల్లి పుట్టినరోజు కావడంతో అమ్మడికి అన్ని పరిశ్రమల నుంచీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పుష్ప టీమ్ ఓ మంచి ఫొటోతో రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. పుష్ప 2 సెట్స్ నుంచి సరికొత్త సిల్ విడుదల చేయగా రష్మిక సహజసిద్ధమైన అందంతో మెరిసిపోతోందనే చెప్పాలి. మరి ఒక్క లుక్ తోనే ఇంతలా మురిపించేస్తున్న అందాల శ్రీవల్లి ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఉర్రూతలూగిస్తుందో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story