Cinema: ఆసక్తి రేకెత్తించేలా 'హీట్' ఫస్ట్ లుక్

Cinema: ఆసక్తి రేకెత్తించేలా హీట్ ఫస్ట్ లుక్
శైలేష్ కొలను చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్

'హీట్' ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో త్వరలోనే ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఎం.ఆర్.వర్మ సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదుగా ఈ టైటిల్ పోస్టర్‌, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయించారు.




Tags

Read MoreRead Less
Next Story