Cinema: ఫ్యామిలీ మాన్ రామ్...

Cinema: ఫ్యామిలీ మాన్ రామ్...
ఆర్.ఎఫ్.సి.లో రామ్ ఫ్యామిలీ టైమ్

హీరో రామ్ ప్రస్తుతం ఫ్యామిలీతో మస్త్ బిజీగా ఉన్నాడు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఏమో అని అనుకుంటున్నారా! ఇంచు మించు అలాంటిదే, కాకపోతే రియల్ ఇంట్లో కాదు రీల్ ఇంట్లో. బోయపాడి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ప్రిన్స్ ఓ పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక్కడే రామ్, శ్రీలీల, ఇతరులపై కొన్ని కుటుంబ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సన్నివేశాలే సినిమాలో కీలకమైన మలుపుకు కారణం అవుతాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ ప్రెజెంట్ చేయనున్నారు. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రామ్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. మరోవైపు అఖండతో భారీ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేందుకు గట్టిగానే కృషి చేస్తున్నాడని తెలుస్తోంది. ఏమైనా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షుకులను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story