Cinema: నాడు టిక్ టాక్ స్టార్... నేడు సినిమాలో లీడ్ రోల్...!

X
By - Chitralekha |27 Feb 2023 4:30 PM IST
టిక్ టాక్ తో అందరికీ చేరువైన ప్రణవి; హృదయానికి హత్తుకునే వీడియోలతో భారీ ఫాలోయింగ్; దోచేవారెవరురాలో కీలకమైన పాత్ర....
'ప్రణతి మనసుపలికే' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజెన్లకు సుపరిచితమైన ప్రణతి ఇప్పుడు వెండితెరపైనా తళుక్కుమనబోతున్నారు. హృదయానికి హత్తుకునే వీడియోలతో అందరిలోనూ స్ఫూర్తిని నింపే ప్రణతి సాధనాల గతంలో ఆర్జేగా పని చేశారు. స్టార్ ఆర్జేగా ఓ వెలుగు వెలిగారు. వివాహం తరువాత అమెరికాలో సెటిల్ అయిన ప్రణతి క్రమంగా టిక్ టాక్ వీడియోలతో పాప్యులారిటీ సంపాదించుకున్నారు. చక్కని రూపూరేఖలకు తోడు, విశాలమైన ఆమె కళ్లు పలికించే భావాలు వేలకొద్దీ ఫాలోవర్లను తెచ్చిపెట్టాయి. అలా క్రమంగా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడ్డ ప్రణతి 'దోచేవారెవరు'గా సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీదా కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ కు జోడీగా ఆమె నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా అజయా ఘోష్, ప్రణతిపై వ్చచే కామెడీ లవ్ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మరి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆర్జే ప్రణతికి మంచి హిట్ ను అందిస్తుందేమో చూద్దాం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com