Cinema: ఈ సినిమా ఎంతో ప్రత్యేకం: మాళవికా నాయర్

నగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తోన్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కు, పాటలకు మంచి స్పందన లభిస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చ్ 17 సినిమా విడుదలవుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్ లు కూడా చకచకా సాగిపోతున్నాయి. మరోవైపు హీరోయిన్ మాళవిక నైర్ కూడా సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకున్నట్లే కనిపిస్తోంది. నటిగా అద్భుత ప్రతిభా పాటవాలు ఉన్న మాళవికకు ఆశించినంత స్టార్ డమ్ రాలేదనే చెప్పాలి. ఈ సినిమాతో ఆ ముచ్చట తీరేట్టే కనిపిస్తోంది. అంతేకాదు ఇదొక ప్రయోగాత్మక చిత్రమని.. సహజమైన సన్నివేశాలు, సంభాషణలతో స్వచ్ఛమైన వినోదాన్ని పంచబోతున్నామని మాళవిక కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఇక ఈ సినిమా నటిగా తనని మరో మెట్టు పైకి ఎక్కించబోతోందని వెల్లడించింది. ఇక కథలో అంతర్భాగం కాబట్టి ముద్దు సీన్ లోనూ ఏమాత్రం మొహమాటం లేకుండా నటించానంటోంది మాళవిక.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com