సినిమా థియేటర్లు అక్టోబర్ 15న ప్రారంభించ‌డం లేద‌ు..!!

సినిమా థియేటర్లు అక్టోబర్ 15న ప్రారంభించ‌డం లేద‌ు..!!

దేశంలో క‌రోనా వైరస్ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో.. మార్చి 24 నుంచి లాక్‌డౌన్ విధించారు. అప్ప‌టినుంచే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సినిమా హాళ్లు మూత‌ప‌డ్డాయి. అయితే కేంద్రం ఇటీవ‌ల అన్‌లాక్‌-5 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు అక్టోబ‌ర్ 15 నుంచి సినిమా థియేట‌ర్ల‌ను పునఃప్రారంభించుకుంనేందుకు అవ‌కాశం ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల్లో గురువారం నుంచి సినిమా థియేట‌ర్లు తెరిచేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే గుజ‌రాత్‌లో మాత్రం మ‌రో రెండు రోజులు ఆల‌స్యంగా థియేట‌ర్లు ప్రారంభం కానున్నాయి.

గుజ‌రాత్‌లో 15న సినిమా థియేట‌ర్ల‌ను ప్రారంభించ‌డం లేద‌ని అక్కడి సినిమా థియేటర్ య‌జ‌మానుల సంఘం ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. లాక్‌డౌన్ స‌మ‌యానికి సినిమా హాళ్ల‌లో ర‌న్నింగ్‌లో ఉన్న‌ సినిమాల‌ను రీ ర‌న్ చేయాలా, వ‌ద్దా అనే విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌తో ఇంకా ఎలాంటి ఒప్పందం కుద‌ర‌లేద‌ని.. అందువ‌ల్ల సినిమాహాళ్లను అక్టోబ‌ర్ 17న పునఃప్రారంభించాల‌ని నిర్ణ‌యించామ‌ని వారు తెలిపారు.

మరోవైపు ఏపీలో 15 నుంచి థియేటర్లు తెరవకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని 13 జిల్లాల ఎగ్జిబిటర్లు విజయవాడలో భేటీ అయ్యారు. ఒక్కో థియేటర్ తెరిచేందుకు రూ.10 లక్షల అదనపు ఖర్చు అవుతుందని.. 50 శాతం ఆక్యుపెన్సీతో ధియేటర్ల నిర్వహణ కష్టమన్నారు. ఫిక్స్ డ్ విద్యుత్ ఛార్జీలు ఎత్తివేయాలని ప్రభుత్వానికి వారు విజ్ణప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story