Citadel: యాక్షన్ మోడ్ లో సామ్.. పీసీ ప్రశంసల వర్షం...

Citadel: యాక్షన్ మోడ్ లో సామ్.. పీసీ ప్రశంసల వర్షం...
లాంఛనంగా ప్రారంభమైన సిటాడెల్; ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టేసిన సమంత...

లాంగ్ బ్రేక్ రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ సమంత మరోసారి యాక్షన్ లోకి దిగిపోయింది. అయితే ఈసారి నిజంగానే యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అయిందని చెప్పాలి. సిడాడెల్ నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా యాక్షన్ క్వీన్ గా అమ్మడి లుక్స్ అదిరిపోయాయనే చెప్పాలి. దీంతో త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవ్వబోతోందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు రాజ్, డీకే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2022లోనే షూటింగ్ ప్రారంభమవ్వాల్సి ఉండగా, సమంత ఆనారోగ్యం కారణంగా ప్రాజెక్ట్ వాయిదా పడింది. తాజాగా అమ్మడు తిరిగి కోలుకోవడంతో చిత్ర బృందం షూటింగ్ కు సమాయత్తం అయింది. ఇక బ్లాక్ ప్యాంట్స్, లెదెర్ జాకెట్ లో సమంత ఫర్ఫెక్ట్ బాస్ బేబ్ లా కనిపిస్తోందని చెప్పాల్సిందే.. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వర్షెన్ లోకి సమంతను ఆహ్వానిస్తూ ప్రియాంకా చోప్రా ట్వీట్ చేసింది. హాలీవుడ్ సిటాడెల్ లో ప్రియంక, రిచర్డ్ మాడెన్ లీడ్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ రీమేక్ లో సమంత, వరుణ్ ధవన్ అవే పాత్రలను రీక్రియేట్ చేయబోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story