Colour Photo: పబ్‌లో 'కలర్ ఫోటో' టీమ్ పార్టీ.. ఫోటోలు వైరల్..

Colour Photo: ఇటీవల 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన జరిగింది. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా చాలా దెబ్బతిన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు పలు చిత్రాలు థియేటర్లలో విడుదలయినా కూడా ఆ తర్వాత సినిమాలేవి థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితి లేదు. అందుకే 'కలర్ ఫోటో'లాంటి పొటెన్షియల్ ఉన్న సినిమా కూడా ఓటీటీ బాటపట్టింది. అయినా కూడా జాతీయ అవార్డు దక్కించుకుంది. దీంతో మూవీ టీమ్ పార్టీ చేసుకుంది.
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరీ, సహ నటుడు హర్ష.. ఇలా చాలామంది షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినవారే. షార్ట్ ఫిల్మ్స్ నుండి సిల్వర్ స్క్రీన్‌పైకి వెళ్లాలని అనుకునే ఎంతోమందికి వీరిప్పుడు స్ఫూర్తిగా నిలిచారు. జాతీయ అవార్డు అందుకున్న కారణంగా సుహాస్.. కలర్ ఫోటో టీమ్‌తో ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. దానికి 'షార్ట్ ఫిల్మ్ చేసుకునే నా కొడుకులు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అందే ఒకప్పుడు వారు షార్ట్ ఫిల్మ్స్ చేశారని హేళన చేసినవారికి ఇది చెంపదెబ్బ అని సమాధానం ఇచ్చినట్టుగా అర్థమవుతోంది.
ఆ తర్వాత కలర్ ఫోటో టీమ్ అంతా హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అక్కడ బాండ్‌తో కలిసి పాట పాడాడు సుహాస్. ఓటీటీలో విడుదలయినా కూడా కలర్ ఫోటో టీమ్ చాలామంది ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. ఎందరో సెలబ్రిటీలు సైతం ఈ మూవీని ప్రశంసించారు. ఇక తాజాగా కలర్ ఫోటో టీమ్ పార్టీ చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com