హీరోగా ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ సుధాకర్ కొడుకు..!

హీరోగా ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ సుధాకర్ కొడుకు..!
X
కమెడియన్ గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుధాకర్.. ఇప్పుడు తన కొడుకు బెనిడిక్ మైఖేల్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు.

టాలీవుడ్ లో వారసుల సినీ ఎంట్రీ కొత్తేమీ కాదు... చాలా మంది స్టార్స్.. తమ కుమారులను హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో భాగంగానే ఓ కమెడియన్ కొడుకు.. ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కమెడియన్ గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుధాకర్.. ఇప్పుడు తన కొడుకు బెనిడిక్ మైఖేల్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు.

ఓ ప్రాజెక్ట్ ఒకే అయిందని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నరేష్ అనే ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక బెనిడిక్ మైఖేల్ మాట్లాడుతూ.. హీరోగానే కాకుండా.. తన తండ్రి లాగే మంచి పాత్రలు దొరికితే చేసేందుకు కూడా రెడీ అంటున్నాడు.

ఇక సుధాకర్ విషయానికి వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చెన్నైలో రూమ్ షేర్ చేసుకున్న సుధాకర్.. చిరంజీవి కంటే ముందు తమిళంలో 45 చిత్రాల్లో హీరోగా నటించాడు. అక్కడ స్టార్ గా ఎదుగుతున్న సమయంలో.. వ్యక్తిగత కారణాలతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి కమెడియన్ గా స్థిరపడిపోయాడు. అలా స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు.

నటుడు గానే కాకుండా చిరంజీవి హీరోగా నటించిన 'యముడికి మొగుడు' సినిమాతో నిర్మాత మారి మంచి హిట్ కొట్టాడు. 2010లో అనారోగ్యానికి గురైన సుధాకర్.. 40 రోజులు కోమాలో ఉండి.. ఆ తర్వాత కోలుకున్నారు. అనంతరం ఒకట్రెండు సినిమాలు కూడా నటించారు. ప్రస్తుతం అతని కుమారుడిని హీరోగా చేయాలనీ అనుకుంటున్నాడు.

Tags

Next Story