నటి డింపుల్ హయాతి వీరంగం.. DCP కారును ఢీ కొట్టి..

కిలాడి మూవీ ఫేమ్, నటి డింపుల్ హయతి వివాదంలో చిక్కుకుంది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ DCP రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారం రచ్చ రేపుతోంది. ఈ ఘటనలో డింపుల్ హాయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. డీసీపీ డ్రైవర్ చేతన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డింపుల్‌తో పాటు ఆమెకు కాబోయే భర్త డేవిడ్‌పై కూడా పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డింపుల్ హయతి తరుచుగా అతిగా ప్రవర్తిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఎన్నిసార్లు సర్ది చెప్పినా డింపుల్ వినలేదని రాహుల్ హెగ్డే ఆరోపించారు.
హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో నటి డింపుల్ హయతి, డేవిడ్ ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీకి చెందిన ప్రభుత్వ వాహనాన్ని అపార్ట్‌మెంట్ కింద సెల్లార్‌లో పార్కింగ్ చేస్తున్నారు. రాహుల్ హెగ్డే వాహనం పక్కనే హయతి, డేవిడ్‌లు తమ కార్లను పార్కింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు డిసిపి వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారు. ఈ నెల 14న డింపుల్ హయతి తన వాహనంతో డిసిపి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న డిసిపి కారు ముందు భాగం దెబ్బతింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులకు సమర్పించాడు. డింపుల్ హయతి, ఆమెకు కాబోయే భర్త డేవిడ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచి 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com