CVL Narasimha Rao : 'మా' కి బిగ్ షాకిచ్చిన సీవీఎల్ నరసింహరావు..!

CVL Narasimha Rao : 'మా' అసోసియేషన్‌కి బిగ్ షాకిచ్చారు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహరావు. ఇప్పటికే అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న ఆయన.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మా' సభ్యత్వానికీ, రాజీనామా చేసినట్లుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. పరీక్ష రాయకముందే ఫెయిల్ అయ్యానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. " దివంగత నటుల ఆశీస్సులు ఉన్నాయి.. ఈ ఎన్నికలు సజావుగా ముగుస్తాయి. అలా జరగకపోతే 'మా'కి రాజీనామా చేస్తా. ఇందులో సభ్యుడిగా ఉండను. ఓటు కూడా వేయను" అని అన్నారు. ఇలా మాట్లాడిన కాసేపటికే ఆయన రాజీనామా చేశారు. కాగా 'మా' అధ్యక్ష పదవికి ముందుగా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు సీవీఎల్ .. ఆ తరవాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీనితో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ నెలకొంది. మా ఎన్నికలు అక్టోబరు 10న జరగనుండగా, 11న ఫలితాలు రానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com