RRR పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన టీం..!

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించునున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే బైక్‌పై వెళ్తున్నట్టుగా కనిపించారు. ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. అయితే ఈ పోస్టర్ పైన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. బైక్‌పై వెళ్తున్న ఎన్టీఆర్, చెర్రీకి హెల్మెట్లు పెట్టి.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపైన చిత్ర యూనిట్ ఫన్నీగా స్పందించింది. 'ఇప్పటికి అది పరిపూర్ణంగా లేదు. నెంబర్ ప్లేట్ మిస్సయింది'అంటూ కామెంట్ పెట్టింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాని డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Now it is perfect.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 29, 2021
Wear Helmet. Be Safe.@RakeshGoudE @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @ssrajamouli @DVVMovies #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/LDa20NYxCg
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com