అహ నా పెళ్లంట : లక్ష్మిపతి పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా?

అహ నా పెళ్లంట : లక్ష్మిపతి పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా?

కోట శ్రీనివాసరావు.. విలక్షనమైన నటుడు.. పాత్ర ఏదైనా సరే.. దానికి వందకి వంద శాతం న్యాయం చేస్తాడు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విలన్‌గా, హాస్యనటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అలాంటి విలక్షణమైన పాత్రలలో 'అహనా-పెళ్లంట' సినిమాలోని లక్ష్మీపతి పాత్ర ఒకటి.. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ పైన డాక్టర్ డి రామానాయుడు నిర్మించారు.

ఈ సినిమాలో లక్ష్మీపతి పాత్రలో కోట శ్రీనివాసరావు నటన మహాద్భుతమనే చెప్పాలి.. ఆ పాత్రలో మరొకరిని ఉహించుకోలేము కూడా.. అరగుండు పాత్ర బ్రహ్మానందంతో అయన చేసిన కామెడీ ఇప్పటికి,ఎప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. కోడిని ముందు పెట్టుకొని అన్నం తినే సన్నివేశాన్ని ఎన్నిసార్లు చూసిన నవ్వు ఆగదు మరి!


అయితే కథ రాసుకున్నప్పుడు ముందుగా ఈ పాత్రను కోటతోనే చేయించాలని దర్శకుడు జంధ్యాల ఫిక్స్ అయ్యారట.. కానీ కథ, పాత్రను తెలుసుకున్నాక ఈ పాత్రకి రావు గోపాల్ రావు అయితే బాగుంటుందని రామానాయుడు వాదించారట. ఇలా ఇరవై రోజులుగా పైగా ఇద్దరి మధ్య చర్చ జరిగిందట. ఫైనల్ గా ముందుగా జంధ్యాల అనుకున్నట్టుగా లక్ష్మీపతి పాత్ర కోట శ్రీనివాసరావుకే దక్కింది.

జంధ్యాల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ పాత్రతోనే సినిమాని నిలబెట్టారు కోట.. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో కోట శ్రీనివాసరావు మళ్ళీ వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఈ విషయాలను కోట ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story