స్టార్ హీరోతో దాసరి వందో సినిమా.. ఇక్కడ ప్లాప్.. అక్కడ సూపర్ డూపర్ హిట్..!

స్టార్ హీరోతో దాసరి వందో సినిమా.. ఇక్కడ ప్లాప్.. అక్కడ సూపర్ డూపర్ హిట్..!
తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు.

తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌‌బుక్‌‌లో చోటు సంపాదించారయన. దాదాపుగా అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దాసరి.. మెగాస్టార్ చిరంజీవితో ఒకే ఒక సినిమా చేశారు. అదే లంకేశ్వరుడు చిత్రం. ఇది దాసరికి 100వ చిత్రం కావడం విశేషం. రాధా హీరోయిన్ గా నటించింది. వడ్డే రమేష్ ఈ సినిమాని నిర్మించారు.

మెగాస్టార్ యముడికి మొగుడు సినిమాకి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన రాజ్ కోటి ఈ సినిమాకి అత్యద్భుతమైన పాటలు అందించారు. "జివ్వుమని కొండగాలి..కత్తిలా గుచ్చుతోంది" అనే పాట మెగాస్టార్ నటించిన టాప్ టెన్ పాటల్లో ఒకటిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాసరి వందో సినిమా, స్టార్ హీరో చిరంజీవితో కావడంతో సినిమా పైన అంచనాలు బాగా పెరిగిపోయాయి.

1989లో భారీ హైప్‌‌తో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది. ఇందులో చిరంజీవి చెల్లెళ్ళుగా రేవతి నటించింది. అయితే సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ కావడం సినిమాకి మైనస్‌‌గా మారింది. కానీ విచిత్రమేమంటే లంకేశ్వరుడు సినిమా తమిళ్ లోకి డబ్ అయి అక్కడ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ చిరు,దాసరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story