Project K : దీపికకు ముందు ప్రాజెక్ట్ కె హీరోయిన్ ఎవరంటే..

Project K : దీపికకు ముందు ప్రాజెక్ట్ కె హీరోయిన్ ఎవరంటే..
Project K : ప్రాజెక్ట్ కె మూవీ గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే

Project K : ప్రాజెక్ట్ కె మూవీ గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే దర్శకుడు నాగశ్విన మొదట దీపిక పదుకొనే కాకుండు సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ని ఎంచుకున్నారట. ఈ విషయమై నాగశ్వన్, హను రాఘవపూడి మధ్య చర్చ కూడా జరిగిందట. హను రాఘవపూడి నాగశ్విన్‌కు సీతారామం కథ వినిపించారట. 'సీతారామం కథకు మృణాల్ ఠాకూర్ అయితేనే నప్పుతుంది, నేనే ప్రాజెక్ట్ కె కోసం వేరే హీరోయిన్‌ను ఎంచుకుంటా' అని నాగశ్విన్ హను రాఘవపూడితో అన్నారట. ఈ విశయాన్ని దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో వెళ్లడించారు.

నాగశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. ఈ సినిమా టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. మూడవ ప్రపంచ యుద్ధ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుంది. ఇందులో ఉపయోగించే వాహనాలను మహింద్రా కంపెనీ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించారట దర్శకుడు నాగశ్విన్.







Tags

Read MoreRead Less
Next Story