ఈ శ్రీకాంత్ హీరోయిన్ ని గుర్తుపట్టారా?

ఈ శ్రీకాంత్ హీరోయిన్ ని గుర్తుపట్టారా?
దర్శేకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా పెళ్లి సందడి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

దర్శేకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా పెళ్లి సందడి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో గ్లామర్ హీరోయిన్ గా దీప్తి భట్నాగర్ కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆటో డ్రైవర్,సుల్తాన్,మా అన్నయ్య, కొండవీటి సింహాసనం మొదలగు సినిమాలలో నటించి మెప్పించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ. కేరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే, బాలీవుడ్ డైరెక్టర్ రణదీప్ ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ బిజినెస్ పనులను చూసుకుంటుంది. తాజాగా యోగా దినోత్సవం నాడు చేసిన యోగ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఆమె అందం ఇంకా ఏ మాత్రం తగ్గలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story