ఈ బాలయ్య హీరోయిన్.. హీరో సురేష్ మొదటి భార్య అని మీకు తెలుసా..?

ఈ బాలయ్య హీరోయిన్.. హీరో సురేష్ మొదటి భార్య అని మీకు తెలుసా..?
హీరో సురేష్.. 1990 హీరోల్లో ఈయన ఒకరు. తనదైన నటనతో తెలుగు, తమిళ్, మలయాళ ప్రేక్షకులను మెప్పించారయన. దాదాపు 274 చిత్రాలలో నటించారు సురేష్.

హీరో సురేష్.. 1990 హీరోల్లో ఈయన ఒకరు. తనదైన నటనతో తెలుగు, తమిళ్, మలయాళ ప్రేక్షకులను మెప్పించారయన. దాదాపు 274 చిత్రాలలో నటించిన సురేష్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌గా కొనసాగుతున్నారు. సురేష్ హీరోగా కొనసాగుతున్న టైంలో ఓ హీరోయిన్‌‌‌‌తో ప్రేమలో పడ్డారు. ఆమె అనితా రెడ్డి. ఆమె ఎవరో కాదు.. హాస్యబ్రహ్మా జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన బాబాయ్ అబ్బాయి సినిమాలో హీరోయిన్. ఇదే ఆమెకి మొదటి సినిమా కావడం విశేషం. హీరోయిన్‌‌‌గా కంటే ముందు ఆమె సింగర్‌‌‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

చిరంజీవి 'ఖైదీ' మూవీలో "త‌ప్పించుకోలేవు నా చేతిలో" అనే పాట‌ను పాడింది ఈమె కావడం విశేషం. నిజానికి బాబాయ్ అబ్బాయి కంటే ముందు సీనియర్ నరేష్ హీరోగా వచ్చిన శ్రీవారి శోభనం సినిమాకి హీరోయిన్‌‌‌గా అనితా రెడ్డిని తీసుకున్నారు జంధ్యాల. అయితే బాబాయ్ అబ్బాయి చిత్రం ముందుగా విడుదలైంది. ఈ సినిమాలతో పాటుగా భానుచందర్ హీరోగా వచ్చిన టెర్రర్ సినిమాలో కూడా ఈమె నటించింది. ఇందులో సురేష్ కూడా నటించాడు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమకి దారి తీసింది. అనంతరం వీరు పెళ్లి చేసుకున్నారు.

ఆశ్చర్యం ఏంటంటే.. పెళ్ళికి ముందు సురేష్‌‌కి పెద్దగా సినిమాలేమీ లేవు. కానీ పెళ్లి అయ్యాక మాత్రం వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. అయితే ప్రేమించే టైంలో అనితా రెడ్డికి విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని, అక్కడే స్థిరపడాలని ఉండేదని సురేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడం, ఒకవేళ వచ్చిన ఇంతమంది హేమాహేమీల మధ్య ఎక్కడ నెగ్గుకొస్తాంలే అనే అనుమానంతో ఆమె కోరికను ఒప్పుకున్నట్టుగా సురేష్ తెలిపారు.

కానీ అనూహ్యంగా సినిమా అవకాశాలు రావడం, హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో తన భార్య కోరికను నేరవేర్చలేకపోయానని, అనంతరం ఇద్దరం విడాకులు తీసుకున్నామని, ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయిందని సురేష్ తెలిపారు. కాగా అనితా రెడ్డి నుంచి విడిపోయాక సురేష్ రాజశ్రీ అనే రచయిత్రిని పెళ్లి చేసుకున్నారు. సురేష్ నిర్మించిన పలు సీరియల్స్‌‌కి ఆమె రచయితగా పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story