నాగార్జునని పెళ్లి చేసుకునే ఛాన్స్ మిస్ అయిన స్టార్ హీరోయిన్..!

నాగార్జునని పెళ్లి చేసుకునే ఛాన్స్ మిస్ అయిన స్టార్ హీరోయిన్..!
అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. అనతికాలంలోనే స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. అనతికాలంలోనే స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. నిన్నే పెళ్ళడతా, మన్మధుడు లాంటి సినిమాలతో అమ్మాయిల రాకుమారుడయ్యాడు. దీనితో అప్పట్లో నాగ్ అంటే మంచి క్రేజ్ ఉండేది. నాగార్జున ముందుగా మూవీ మొఘల్ డి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున.. హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇదిలావుండగా ఓ మూవీ షూటింగ్‌‌లో నాగార్జున తండ్రి నాగేశ్వరరావు ఓ రోజు తన కుమారుడిని పెళ్లి చేసుకోమని ఓ హీరోయిన్ వద్దకి ప్రపోజల్ తీసుకోచ్చారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ సుమలత. అవును చూడడానికి లక్షణంగా ఉన్నావు.. నీకు హైట్‌‌కి తగ్గ కుర్రాడు విదేశాల్లో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటావా.. మీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతానని నాగేశ్వరరావు సరదాగా అన్నారట. అయితే ఏఎన్నార్ లాంటి వ్యక్తి అలా అనడంతో సుమలత ఏమనాలో తెలియక.. ఎవరండి ఆ అబ్బాయి అని అడిగేసిందట.

ఎవరో కాదు మా అబ్బాయి నాగార్జున అని చెప్పారట నాగేశ్వరరావు. దీనితో సిగ్గుపడుతూ ఏం చెప్పాలో తెలియక అక్కడినుంచి వెళ్ళిపోయిందట సుమలత. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ విషయం జరిగినప్పుడు నాగార్జునకి ఇంకా ఇండస్ట్రీకి రాలేదు. పెళ్లి కూడా కాలేదు. అప్పట్లో దీని గురించి చాలా మంది మాట్లాడుకునే వారని సుమలత చెప్పుకొచ్చింది. కాగా నాగార్జున, సుమలత కలిసి జోడిగా నటించలేదు కానీ బాస్ చిత్రంలో కలిసి నటించారు.

Tags

Read MoreRead Less
Next Story