దిల్ రాజ్ రిలీజ్ చేసిన 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' ట్రైలర్..!

దిల్ రాజ్ రిలీజ్ చేసిన కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ ట్రైలర్..!
ఆగస్ట్ 4న మూవీ రిలీజ్‌

నూతన దర్శకుడు రాజేష్ దొండపాటి రూపొందుతున్న సినిమా కృష్ణ గాడు అంటే ఒక రేంజ్. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకటసుబ్బయ్య, పి ఎన్ కే శ్రీలత నిర్మించారు. ఈ సినిమాలో రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహాదేవ్ తదితరులు నటించారు. ప్రేమ కథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈరోజు ఈ సినీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చే విడుదల చేశారు.సినిమా మంచి సక్సెస్ కావాలంటూ దర్శక నిర్మాతలను విష్ చేశారు. ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి పాటలు రచించాడు. సాబు వర్గీస్ మ్యూజిక్ అందించారు.

ఓ అంద‌మైన ప‌ల్లెటూరిలో కృష్ణ అనే చ‌లాకీ కుర్రాడు. ఆ ఊరే అతని ప్ర‌పంచం. అలాంటి కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయిని వ‌స్తుంది. సాఫీగా సాగిపోతున్న అత‌ని జీవితంలో అమ్మాయి పరిచయం తరువాత వచ్చిన మార్పులేంటి.. అమ్మాయి చేయి అందుకుంటాడా, తండ్రి కోరిక‌ను నేరవేరుస్తాడా ? అనే విష‌యాలు తెలియాలంటే `కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్‌` సినిమా చూడాల్సిందే అంటున్నారు మేక‌ర్స్‌.

Tags

Read MoreRead Less
Next Story