Chandoo Mondeti : ఆ బాలీవుడ్ ‌స్టార్‌తో సినిమా తెరకెక్కించనున్న 'కార్తికేయ' డైెరెక్టర్..

Chandoo Mondeti : ఆ బాలీవుడ్ ‌స్టార్‌తో సినిమా తెరకెక్కించనున్న కార్తికేయ డైెరెక్టర్..
Chandoo Mondeti : టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ డైరెక్టర్‌లలో చందూ మొండేటి ఒకరు. ‘కార్తికేయ’ సినిమాతో ఈ దర్శకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు

Chandoo Mondeti : టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ డైరెక్టర్‌లలో చందూ మొండేటి ఒకరు. 'కార్తికేయ' సినిమాతో ఈ దర్శకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక దాని సీక్వెల్‌ 'కార్తికేయ2'తో దేశ వ్యాప్తంగా అఖండ విజయాన్ని అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయకుండానే 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఊహించని రికార్డు అందుకుంది.

దీంతో ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్‌ ఇండియా ఫిల్మ్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నారట. బాలీవుడ్‌కు చెందిన ఒకరిద్దరు బడా హీరోలతో ఈ సినిమా తీయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ హీరోలు ఎవరో తెలుసుకోవడం కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

'కార్తికేయ2' తర్వాత అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌తో ఓ సినిమా చేసేందుకు చందూ మొండేటి చర్చలు జరిపారని టాక్‌. ఇక ఈ సినిమాలో హీరోలుగా బాలీవుడ్‌ హీరోలు హృతిక్‌ రోషన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ పేర్లు వినిపిస్తున్నప్పటికీ హృతిక్‌నే ఫైనల్‌ చేసే అవకాశమున్నట్లు సమాచారం.

ఇదే నిజమైతే టాలీవుడ్‌ దర్శకుడు బాలీవుడ్‌ హీరో కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. అయితే దీనిపై అటు గీతా ఆర్ట్స్‌ కానీ, ఇటు చందూ మొండేటీ కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story