టాలీవుడ్

Samantha: సమంతను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే: సీనియర్ డైరెక్టర్

Samantha: టీనేజ్‌లోనే సమంత మోడల్‌గా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది.

Samantha: సమంతను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే: సీనియర్ డైరెక్టర్
X

Samantha: సౌత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సమంత.. మొదటి సినిమా నుండే తన మ్యాజిక్‌ను చూపించడం ప్రారంభించింది. వరుసగా సినిమాలన్నీ హిట్లు అవ్వడంతో సమంతకు తొందరగానే గోల్డెన్ లెగ్ అనే గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు ఫ్లాపులు ఎదురైనా.. తన కెరీర్ సాఫీగానే సాగింది. తాజాగా సమంతను ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానే అంటూ ఓ సీనియర్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీనేజ్‌లోనే సమంత మోడల్‌గా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది. అలా అడుగుపెట్టిన కొన్నాళ్లకే పలు యాడ్స్‌లో నటించే అవకాశం కూడా తనకు లభించింది. ఆ తర్వాత ముందుగా తమిళ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్న సమంత.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏమాయ చేశావే'తో అందరి దృష్టిలో పడింది. కానీ గౌతమ్ మీనన్ కాకుండా సమంతను తానే ఇండస్ట్రీకి పరిచయం చేశానంటున్నాడు ఈ దర్శకుడు.

సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇండస్ట్రీలోని పలు సెలబ్రిటీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సమంతను ఇండస్ట్రీకి తానే పరిచయం చేశానని అన్నారు గీతాకృష్ణ. సమంత మోడల్‌గా ఉన్నప్పుడు తానే.. సమంతను ఓ యాడ్ కోసం తీసుకున్నానని.. ఆ తర్వాత తనకు చాలా యాడ్ అవకాశాలు వచ్చాయని, అలా సినిమాల్లోకి కూడా వెళ్లిందని తెలిపారు.Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES