Satyadev: పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథలో సత్యదేవ్..

Satyadev: పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథలో సత్యదేవ్..
Satyadev: ఈ కథను పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని కానీ ఆయన వరకు వెళ్లలేకపోయానని అన్నాడు గోపీ.

Satyadev: ముందుగా దర్శకులు ఓ హీరోను దృష్టిలో పెట్టుకొని కథ రాయడం కానీ అనుకోని కారణాల వల్ల మరొక హీరోతో ఆ సినిమాను తెరకెక్కించాల్సి రావడం చాలా కామన్‌గా జరిగే విషయాలే. ముఖ్యంగా అప్‌కమింగ్ డైరెక్టర్స్ చాలామంది స్టార్ హీరోల కోసం కథలు రాసుకుంటారు. కానీ అది కుదరక ఆ కథకు సూట్ అయ్యే మరో హీరోతో సినిమాలు చేస్తారు. తాజాగా టాలీవుడ్‌లో ఓ అప్‌కమింగ్ దర్శకుడికి కూడా అదే జరిగింది.

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచమయ్యి మెల్లగా హీరో స్థాయికి ఎదిగాడు సత్యదేవ్. సత్యదేవ్‌లోని నటుడిని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా 'బ్లఫ్ మాస్టర్'. ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీ గణేష్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో చిత్రం 'గాడ్సే'.. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక బొమ్మ తుపాకీ కూడా ఉపయోగించడం ఇష్టం లేని ఓ వ్యక్తి.. సీరియల్ కిల్లర్‌గా మారే కథే గాడ్సే. అయితే ఈ కథ, ఒరిజినల్ గాడ్సే కథకు ఏ సంబంధం లేదని దర్శకుడు స్పష్టం చేశాడు. ఇది ఎంటర్‌టైనర్ కాదని ఆలోచింపజేసే సినిమా అని స్పష్టం చేశాడు. అయితే ముందుగా ఈ కథను పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని కానీ ఆయన వరకు వెళ్లలేకపోయానని అన్నాడు గోపీ. ఇక ఈ శుక్రవారం విడుదల కానున్న విరాటపర్వంకు పోటీగా గాడ్సే చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story