రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిసారి పండు పడింది ఈ హీరోయిన్ పైనే..!

సినిమాలు తీయడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ హీరోయిన్‌ను తెరపైన అందంగా చూపించాలంటే అది కేవలం దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావుకి మాత్రమే చెల్లింది. పాటల చిత్రీకరణలో.. హీరోయిన్‌ను గ్లామర్ గా చూపించడంలో ఆయనకీ ఆయనే సాటి అని చెప్పాలి. ఈయన దర్సకత్వంలో నటించేందుకు హీరోయిన్లు పోటి పడేవారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన అంటే ఏంటో.. పాటల చిత్రీకరణలో ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై పూలు, పండ్లు వేయడం ఆయనకి అదో మార్క్ లాగా ఉండిపోయింది.
ప్రతి సినిమాలో తన మార్క్ మిస్ అవ్వకుండా చూసుకుంటారయన.. అయితే దీనికి ముందు బీజం పడింది ఎక్కడో తెలుసా..! చిరంజీవి, విజయశాంతి, సుహాసిని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన 'మంచి దొంగ' సినిమాతో. ఈ సినిమాలో 'బెడ్ లైట్ తగ్గించనా' అనే పాటలో తొలిసారి విజయశాంతి పై పండ్లు వేసారు రాఘవేంద్రరావు. ఈ పాట చిత్రీకరణ కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది. ఫస్ట్ నైట్ కి సంబంధించిన పాట కావడంతో లైట్లు ఆన్ చేసినపుడు ఓ బీట్.. ఆఫ్ చేసినపుడు మరో బీట్ వచ్చేలా చక్రవర్తి ఈ పాటకు ట్యూన్ చేస్తే.. రాఘవేంద్రరావు అంతే అద్భుతంగా తెరకెక్కించారు.
చిరంజీవి, విజయశాంతి కూడా డాన్స్ అదరగొట్టారు. అలా మొదటి పండు విజయశాంతిపై పడిందన్న మాట
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com