Chiranjeevi_Balakrishna : వీరిద్దరిని టాప్ హీరోలను చేసింది ఒకేఒక్క దర్శకుడు...!

Chiranjeevi _ Balakrishna : చిరంజీవి, బాలకృష్ణ.. ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలే.. అందులోనూ ఇద్దరు మాస్ హీరోలే.. శతాధిక చిత్రాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు వీరిద్దరూ.. ఇప్పటికి తమ సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇదిలావుండగా ఇద్దరికీ మాస్ హీరో, టాప్ హీరో అనే ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది మాత్రం ఒకేఒక్క దర్శకుడని చెప్పాలి. ఆయనే కోదండరామిరెడ్డి.
చిరంజీవి, కోదండరామిరెడ్డి లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్.. మొత్తం వీరి కాంబినేషన్‌లో మొత్తం 25 చిత్రాలు వచ్చాయి. ఇందులో 22 హిట్లున్నాయి. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం న్యాయం కావాలి.. చివరి చిత్రం ముఠామేస్త్రీ.. అభిలాష, ఖైదీ, ఛాలెంజ్, విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, త్రినేత్రుడు, మరణ మృదంగం, ముఠామేస్త్రీ వంటి హిట్ చిత్రాలు వీరి ఖాతాలో ఉన్నాయి. ఇందులో త్రినేత్రుడు చిరంజీవికి వందో సినిమా కాగా కోదండరామిరెడ్డికి 50వ సినిమా కావడం విశేషం.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి టాప్ హీరోగా, అదే విధంగా మాస్ హీరోగా నిలబడడానికి ఈ సినిమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పాలి. మిగతా దర్శకులు కూడా ఎన్నో హిట్లు ఇచ్చినా, ఆ హిట్లతో చిరంజీవికి ఎంతమంచి పేరు వచ్చినా... వాటికి పునాది మాత్రం కోదండరామిరెడ్డితో చేసిన సినిమాలేనని చెప్పుకోవచ్చు.
ఇక బాలకృష్ణ, కోదండరామిరెడ్డి లది కూడా సక్సెస్ఫుల్ కాంబినేషన్‌నే.. మొత్తం వీరి కాంబినేషన్‌లో మొత్తం 13 చిత్రాలున్నాయి. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం అనసూయమ్మగారి అల్లుడు, చివరిచిత్రం యువరత్న రాణా.. బొబ్బిలి సింహం, నారీ నారీ నడుమ మురారి, భానుమతి గారి మొగుడు వంటి చిత్రాలు వీరి ఖాతాలో ఉన్నాయి. అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణకి, కోదండరామిరెడ్డితో చేసిన ఈ సినిమాలు మంచి హిట్‌గా నిలిచి ఆయన కెరీర్‌కి మరింత ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com