Anasuya Bharadwaj: అనసూయ చిన్న పాత్రలు చేయదు: డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Anasuya Bharadwaj: ఈమధ్య బుల్లితెరపై ఫైమస్ అయిన యాంకర్లు, నటీనటులు.. వెండితెరపై కూడా తమ అదృష్టా్న్ని పరీక్షించుకోవడానికి ముందుకొస్తున్నారు. అందులో చాలావరకు సక్సెస్ అవుతున్నారు కూడా. అందులో ఒకరే జబర్దస్త్ యాంకర్ అనసూయ. అనసూయ ఇప్పటికీ నటిగా పలు సినిమాల్లో నటించింది. తాజాగా తన పాత్రల సెలక్షన్‌పై ఓ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
డైరెక్టర్ మారుతి, గోపీచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పక్కా కమర్షియల్' మూవీ ప్రమోషన్స్ ఫుల్ ఫామ్‌లో జరుగుతున్నాయి. దానికోసమే అనసూయ యాంకర్‌గా చేస్తున్న 'జబర్దస్త్' షోకు వచ్చారు. రాగానే పక్కా కమర్షియల్ యాంకర్‌ను కలుద్దామని ఈ షోకు వచ్చానని మారుతి అన్నారు. అనసూయ మామూలు కమర్షియల్ కాదని, చిన్నచిన్న పాత్రలు ఇచ్చినా చేయదని మారుతి బయటపెట్టారు.
అంతే కాకుండా మారుతి.. ఈ షోలో అనసూయ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అనసూయకు తాను ఎన్ని ఆఫర్లు ఇచ్చినా రిజెక్ట్ చేసిందని బయటపెట్టారు. కానీ ఏ సినిమాలను రిజెక్ట్ చేసిందో మాత్రం చెప్పలేదు. ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తుండగా.. ఇటీవల హీరోయిన్ మరో మూవీకి కూడా పూజా కార్యక్రమం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com