"అన్నపూర్ణ ఫోటో స్టూడియో" టీజర్ విడుదల

అన్నపూర్ణ ఫోటో స్టూడియో టీజర్ విడుదల
అన్నపూర్ణ ఫొటో స్టూడియో టీజర్ విడుదల చేసిన డైరెక్టర్ మారుతి

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన సినిమా "అన్నపూర్ణ ఫోటో స్టూడియో"త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది . ఈ సినిమాకి సంబందించిన టీజర్ స్టార్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా విడుదల అయింది. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు.ఇందులో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ - ఓ పిట్టకథ సినిమా స్క్రీన్ ప్లే చూసినప్పటి నుంచి తనని చెందు ముద్దు వర్కింగ్ స్టైల్ ఇంప్రెస్ చేసిందన్నారు . అప్పటి నుంచి తను నాతో ట్రావెల్ అవుతున్నాడు. త్వరలో మా సంస్థతో సినిమా చేయబోతున్నాడు. "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" సినిమాను చెందు బాగా తెరకెక్కించారు. ఎక్కడ కూడా నేటివిటీ మిస్ కాకుండా యూనిక్ గా తెరకెక్కించాడు.ఈ సినిమాలో లావణ్య, చైతన్య ప్రామిసింగ్ గా నటించారు.ఇలాంటి క్రియేటివ్ చిత్రాలు చాల అరుదుగా వస్తాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story