Samantha: సమంత పర్సనల్ లైఫ్ గురించి నందిని రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. విడాకులపై కూడా..

Samantha: సినీ పరిశ్రమలో కొన్ని ఫ్రెండ్‌షిప్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి, హిట్స్ వచ్చినా.. ఫ్లాప్స్ వచ్చినా.. తోడుగా ఉంటూ ప్రోత్సహించే ఫ్రెండ్స్.. కేవలం హీరోహీరోయిన్లకే కాదు.. దాదాపు ప్రతీ టెక్నిషియన్‌కు ఉంటారు. అలా సమంతకు కూడా ఇండస్ట్రీలో చాలామందే ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి ఫ్రెండ్స్‌లో ఒకరు డైరెక్టర్ నందిని రెడ్డి. ఇటీవల నందిని రెడ్డి.. సమంత పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ముందుగా నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో 'జబర్దస్త్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి నందిని రెడ్డి, సమంత.. ఇద్దరూ తమ కెరీర్ ప్రారంభంలోనే ఉన్నారు. అప్పుడే వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఆ తర్వాత మళ్లీ 'ఓ బేబి' సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించింది నందిని రెడ్డి. అప్పటికే వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే తాజాగా సమంత జీవితంలో జరుగుతున్న విషయాలపై నందిని రెడ్డికి ప్రశ్నలు ఎదురయ్యాయి.
జబర్దస్త్ సినిమా చేస్తున్న సమయంలో సమంత తనకు బాగా క్లోజ్ అయ్యిందని తెలిపింది నందిని రెడ్డి. తామిద్దరు అక్కాచెల్లెల్లుగా ఉండేవారని చెప్పింది. ఆ సమయంలో సమంత లైఫ్‌లో కొన్ని సమస్యలు వచ్చాయని.. ఆరోగ్య సమస్యలు వచ్చాయని బయటపెట్టింది నందిని రెడ్డి. అప్పుడు తానే సమంతకు సపోర్ట్‌గా ఉండడంతో మరింత క్లోజ్ అయ్యామని చెప్పుకొచ్చింది.
సమంత విడాకుల గురించి కూడా నందిని రెడ్డికి ప్రశ్న ఎదురయ్యింది. సమంత పర్సనల్ లైఫ్‌లో తాను జోక్యం చేసుకోనంటూ క్లారిటీ ఇచ్చేసింది నందిని రెడ్డి. సమంతనే కాదు ఎవరి పర్సనల్ లైఫ్ లలో మనం జోక్యం చేసుకోకూడదని చెప్పింది. భార్య భర్తల మధ్య సవా లక్ష ఉంటాయని.. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళకే తెలుస్తుందని చెప్పింది. అయితే సమంత లైఫ్‌లో ఏం జరిగినా తనకు సపోర్ట్‌గా ఉంటానని హామి ఇచ్చింది నందిని రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com