'పెళ్లిసందD'లో రాఘవేంద్రరావు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఎందుకు కనిపించారు.. చెబితే స్పెషల్ గిఫ్ట్..!

పెళ్లిసందDలో రాఘవేంద్రరావు  కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఎందుకు కనిపించారు.. చెబితే స్పెషల్ గిఫ్ట్..!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు... తెలుగు సినిమాకి గ్లామర్ డోస్ అద్దిన ఘనుడు.. హీరోయిన్ లను గ్లామర్ గా చూపించడం, ఏజ్ బార్ హీరోలకి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఘనత ఆయనకే చెల్లింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు... తెలుగు సినిమాకి గ్లామర్ డోస్ అద్దిన ఘనుడు.. హీరోయిన్ లను గ్లామర్ గా చూపించడం, ఏజ్ బార్ హీరోలకి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఘనత ఆయనకే చెల్లింది. కమర్షియల్, భక్తి ఇలా జోనర్ ఏదైనా సరే తనదైన మార్క్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. శతాధిక చిత్రాలకి దర్శకత్వం వహించి రికార్డు సృష్టించిన ఆయన మళ్ళీ "పెళ్లిసందD" అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు.

రోషన్, శ్రీలీల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి గౌరీ రోణంకి దర్శకత్వం వహించగా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా టీవీ5 లోని మూర్తి షోకి ఇంటర్వ్యూ ఇచ్చారు రాఘవేంద్రరావు.. సినిమా గురించి పలు విశేషాలను పంచుకున్నారు.

ఇక సినిమాలో నటించడం పైన ఆయన మాట్లాడుతూ.. " మా నాన్నగారు కేఎస్ ప్రకాష్ గారు పలు సినిమాలలో హీరోగా నటించి ఆ తర్వాత దర్శకుడిగా మారారు.. కానీ నేను మొదటగా దర్శకుడిని అయ్యాను.. మా ఇంట్లో పిల్లలు అప్పుడప్పుడు సినిమాల్లో సరదాగా చిన్న వేషం వేయొచ్చు కదా అని అడిగేవారు.. అప్పుడు చేయాలనీ అనుకున్నాను.. దానికి వీలుగా ఈ సినిమాలో ఓ రోల్ అనుకోని చేశాను.. దీనితో పాటుగా ఈ సినిమాలో తాను తప్ప ఇంకెవరు నటిస్తే బాగుంటుందని యూనిట్ లో అందర్నీ అడిగితే.. వారు కూడా మీరు తప్ప ఎవరు కూడా సూట్ కారని చెప్పారు.. దీనితో చేయాల్సి వచ్చింది" అని దర్శకేంద్రుడు చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమా మొత్తంలో తాను కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కనిపిస్తాను అలా ఎందుకో తెలుసా అంటూ మూర్తికి క్వశ్చన్ వేశారు రాఘవేంద్రరావు.. దీనికి ఎవరైనా సరైన సమాధానం చెబితే స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తానని అన్నారు దర్శకేంద్రుడు. దీనికి సరైన సమాధానం తెలిసినవారు ఈ కింద మెయిల్ ఐడీకి పంపగలరు

Email : cinema@tv5news.inTags

Read MoreRead Less
Next Story