భూమిక అలా చేయడం వల్ల నలబై రోజులు బయటకి కూడా రాలేకపోయాను : రవిబాబు

భూమిక అలా చేయడం వల్ల నలబై రోజులు బయటకి కూడా రాలేకపోయాను : రవిబాబు
చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో దర్శకుడిగా రవిబాబుకి మంచి పేరుంది. విలక్షణ నటుడు చలపతిరావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రవిబాబు.

చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో దర్శకుడిగా రవిబాబుకి మంచి పేరుంది. విలక్షణ నటుడు చలపతిరావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రవిబాబు.. ముందుగా విలన్ పాత్రలతో కెరీర్‌‌ని రాణించిన రవిబాబు.. ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. 'అల్లరి' సినిమాతో దర్శకుడిగా మారి.. నువ్వీలా, అనసూయ, అవును మొదలగు విభిన్నమైన చిత్రాలను తీశాడు.

రవిబాబు నుంచి ఏమైనా సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్‌‌లో ఓ ఇంట్రెస్ట్ కలిగేలా చేశాడు. ఇదిలా ఉంటే 'అనసూయ' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని ఓ యూట్యూబ్ ఛానల్‌‌తో పంచుకున్నారు రవిబాబు. 2007లో వచ్చిన ఈ సినిమాలో రవిబాబుతో పాటుగా నటి భూమిక కూడా కీ రోల్ ప్లే చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో భూమిక కారణంగా రవిబాబు చాలా ఇబ్బందులు పడ్డారట.

"సినిమా కోసం నేను గడ్డం, జట్టుతో పాటు కనుబొమ్మలను కూడా గీయించుకున్నాను .. అలా భూమికతో కలిసి ఓ సన్నివేశాన్ని తెరకెక్కించాను. ఆ తర్వాత షాట్ సమయానికి భూమిక తనకి హెల్త్ బాలేదని వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు కూడా హెల్త్ బాలేదని చెప్పి దాదాపుగా నలబై రోజుల పాటు షూటింగ్‌‌కి రాలేదు. అప్పటికే గుండు, కనుబొమ్మలు లేకుండా నేను బయట తిరగలేకపోయాను. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను" అని రవిబాబు చెప్పుకొచ్చాడు.

కాగా రవిబాబు తాజాగా క్రష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒటీటీ వేదికగా రిలిజైన ఈ చిత్రం యూత్‌‌ని బాగానే ఆకట్టుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story