Ravibabu On Udaykiran : ఉదయ్ కిరణ్ పెద్ద షాక్ ఇచ్చాడు.. అదే నేను చేసిన పెద్ద తప్పు : రవిబాబు

Ravibabu On Udaykiran : వైవిధ్యమైన చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ రవిబాబు.. నటుడుగానే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ డైరెక్టర్ గా బాగా ఫేమ్ అయ్యాడు. సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా చిత్రాలను తెరకెక్కించడం ఆయన స్పెషాలిటీ.. ఈ మధ్య సక్సెస్ ట్రాక్ లేకపోయిన ఆయన సినిమాలకి ఇప్పటికి మంచి క్రేజ్ ఉంది. ఇదిలావుండగా 2005లో సక్సెస్ఫుల్ పెయిర్ తరుణ్, ఆర్తి అగర్వాల్ తో సోగ్గాడు అనే సినిమాని తెరకెక్కించారు రవిబాబు.. ఇది ఆయనకి మూడో చిత్రం కావడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించింది.
అయితే ఈ సినిమాని తరుణ్ తో పాటుగా మరో హీరోగా ఉదయ్ కిరణ్ అని అనుకున్నాడు రవిబాబు.. ముందుగా ఈ సినిమాని చేస్తానని చెప్పిన తరుణ్.. సడన్ గా తప్పుకోవడం షాక్ కి గురిచేసిందని రవిబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కధంతా రెడీ అయ్యాక ఇప్పుడు నో చెప్పడంతో తాను ఆవేశంలో నిర్ణయం తీసుకోని ఆ పాత్రకి వేరే ఆర్టిస్టుని తీసుకున్నానని చెప్పుకొచ్చాడు రవిబాబు..
తన జీవితంలో చేసిన మొదటి తప్పు అదేనని.. ఇక మళ్లీ ఎప్పుడు అలాంటి తప్పులు చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా ఉదయ్ చేయాల్సిన ఆ పాత్రను బాలీవుడ్ నటుడు జుగల్ హన్సరాజ్ పోషించగా.. సినిమా కమర్షియల్ గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అటు ఈ మధ్య క్రష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రావిబాబు ఆకట్టుకోలేకపోయాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com