RGV On Politics : జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు లేదు: అర్జీవీ

RGV On Politics : తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. 'నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నాకు నేను సేవ చేసుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న వారే పాలిటిక్స్ లోకి వస్తారు. నేను అది కాదు. సహజంగా ఏ నేత అయినా పవర్, ఫేమ్ కోసం రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కానీ ప్రజాసేవ అని పైకి చెబుతాడు' అని వర్మ తెలిపాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ తాజా రాజకీయ పరిస్థితులపై విమర్శలు చేస్తూ వర్మ వరుస పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన రాజకీయాలపై ఈ విధంగా స్పందించారు. ఇక ఓటీటీ అనేది రానున్న రోజుల్లో ప్రజలకు ఎంతగానో చేరువకానుందని వర్మ తెలిపాడు. తనకి తెలిసిన ఓ వ్యక్తితో కలిసి త్వరలోనే ఓటీటీని ప్రారంభిస్తున్నానని, మే 15న అది ప్రారంభం కానుందని వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com