టాలీవుడ్

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌పై డైరెక్టర్ కామెంట్స్.. చాలా బద్ధకస్తులంటూ..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై ఓ డైరెక్టర్ సంచలన కామెంట్స్ చేశాడు.

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌పై డైరెక్టర్ కామెంట్స్.. చాలా బద్ధకస్తులంటూ..
X

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎక్కడ లేని ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే పవనిజం అనేది ఓ బ్రాండ్‌గా మారిపోయింది. తన అభిమాన హీరోను ఏమైనా అంటే ఫ్యాన్స్ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రిటీల్లో కూడా ఎంతోమంది పవన్‌ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన్నే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ముందుకెళ్తున్న వారు ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్‌పై ఓ డైరెక్టర్ సంచలన కామెంట్స్ చేశాడు.

పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే. అలాంటిది పవన్ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాని ప్రకటించగానే చాలామంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇప్పుడు దీనిపైనే డైరెక్ట్‌గా కామెంట్ చేశారు సాయి రాజేష్. హృదయ కాలేయం వంటి చిత్రానికి దర్శకుడిగా, కలర్ ఫోటో వంటి చిత్రానికి నిర్మాతగా పనిచేశారు సాయి రాజేష్. తాను ఇటీవల పవన్ ఫ్యాన్స్‌పై ఓ ట్వీట్ చేశాడు.

'జనసేన ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే పవన్ ఫ్యాన్స్ బద్ధకంగా, బాధ్యతారాహిత్యంగా అయిపోతుంటారు. సినిమా ప్రమోషన్స్‌కు చేసినట్టుగా రీట్వీట్, ట్రెండ్ చేయరు' అని ట్వీట్ చేశాడు సాయి రాజేష్. ఇలా ట్వీట్ చేసినందుకు తాను పవన్ ఫ్యాన్స్ నుండి ఎంతో నెగిటివిటీని ఎదుర్కుంటున్నాడు. కానీ వెనక్కి తగ్గకుండా వాటన్నింటికి కౌంటర్ ఇస్తూ ట్వీట్లు పెడుతున్నాడు సాయి రాజేష్.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES