Director Shankar : శంకర్‌కి షాక్... అల్లుడి పైన లైంగిక వేధింపుల కేసు...!

Director Shankar : సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌పై మంగళవారం పుదుచ్చేరిలో కేసు నమోదైంది.. ఓ పదహారేళ్ళ మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టుగా రోహిత్ దామోదరన్, అతని తండ్రి పాటుగా మరో నలుగురి పైన పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన తనని లైంగికంగా వీరందరూ వేధించారని సదరు బాధిత బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా ఈ విషయం బయట పెడితే చంపేస్తామని బెదిరించినట్టుగా బాధితురాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మరో ఫిర్యాదు ఇచ్చింది. దీనితో రోహిత్‌తో పాటు అతడి తండ్రి, కోచ్ మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే వీరిని అరెస్ట్ చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఇదిలావుండగా ఈ ఏడాది జూన్‌లో రోహిత్‌కి, దర్శకుడు శంకర్ కూతురు ఐశ్వర్యతో వివాహం జరిగింది. ఈ వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com