Actress Kalyani: 'మేమిద్దరం అన్యోన్యంగానే ఉన్నాం.. కానీ..': కళ్యాణి మాజీ భర్త

Actress Kalyani: మేమిద్దరం అన్యోన్యంగానే ఉన్నాం.. కానీ..: కళ్యాణి మాజీ భర్త
Actress Kalyani: 2005లో కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు సూర్య కిరణ్. 2020లో వీరిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు.

Actress Kalyani: ఇప్పుడంటే సోషల్ మీడియా అనేది అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది. కానీ ఒకప్పుడు సోషల్ మీడియాకు ఇంత క్రేజ్ లేదు. అందుకే ఎవరి పర్సనల్ విషయాలు వారిలోనే ఉండిపోయేవి. ఇప్పుడయితే విడాకుల తీసుకుంటున్న సినీ సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలోనే చాలా సమాచారం వచ్చేస్తోంది. ఒకప్పుడు సెలబ్రిటీల విడాకులకు కారణం ఏంటో కూడా చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. అందుకే ఓ డైరెక్టర్.. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్‌తో ఎందుకు విడిపోయారో ఇటీవల బయటపెట్టారు.

2005లో హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు డైరెక్టర్ సూర్య కిరణ్. పదేహేనేళ్లు అన్యోన్యంగా ఉన్న తర్వాత 2020లో వీరిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు కాకపోవడంతో అసలు విడాకులకు కారణం ఏంటని ఎవరూ తెలుసుకోలేకపోయారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న సూర్య కిరణ్.. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగానే ఉన్నా కూడా ఇలా జరిగిందంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు.

సూర్య కిరణ్ కెరీర్ మొదట్లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నా.. ఆ తర్వాత తన సినిమాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. దీంతో అప్పులు కూడా పెరిగిపోయాయి. అయితే ఆర్థిక ఇబ్బందులకు భయపడే కళ్యాణి తనను విడాకులు అడిగి ఉండవచ్చని సూర్య కిరణ్ అన్నారు. ఇక పిల్లలు లేకపోవడం కూడా దీనికి ఒక కారణం అయ్యిండొచ్చని ఆయన కోర్టులో వివరించారట.

విడాకుల సమయంలో కళ్యాణిని వెయిట్ చేయమని, అప్పులు తీరిపోయిన తర్వాత మనం మళ్లీ పెళ్లి చేసుకుందామని చెప్పినట్టు తెలిపారు సూర్య కిరణ్. తాజాగా బిగ్ బాస్‌లో కూడా కనిపించి అలరించారు సూర్య కిరణ్. కానీ కొత్తగా వస్తున్న డైరెక్టర్లతో పోటీ పడలేక సూర్య కిరణ్ మళ్లీ మైక్రోఫోన్ మాత్రం పట్టలేదు. ఇదిలా ఉండగా కళ్యాణి త్వరలోనే ఓ దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story