త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్.. నిర్మాతకి పాదాభివందనం!

త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్.. నిర్మాతకి పాదాభివందనం!
అయన సినిమాలకి, డైలాగ్ లకే కాదు.. అయన స్పీచ్ లకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ స్పీచ్ లకి రీపీటేడ్ ఫ్యాన్స్ మరీ ఎక్కువ అని చెప్పాలి.. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

అయన సినిమాలకి, డైలాగ్ లకే కాదు.. అయన స్పీచ్ లకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ స్పీచ్ లకి రీపీటేడ్ ఫ్యాన్స్ మరీ ఎక్కువ అని చెప్పాలి.. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అక్షరాలను చాలా పోదుపుగా, పదునుగా వాడుతుంటారయన.. అలాంటి త్రివిక్రమ్ ఓ స్టేజ్ మీద ఓ నిర్మాతకు పాదాభివందనం చేశారు ఆ నిర్మాత మరేవరో కాదు.. 'స్రవంతి' రవికిషోర్..

నువ్వే కావాలి సినిమాతో త్రివిక్రమ్ కి స్టార్ రైటర్ గా పేరు వచ్చిందటే దానికి 'స్రవంతి' రవికిషోర్ ఓ కారణమని చెప్పాలి. అలాంటి రైటర్ ని దర్శకుడిగా కుడా అవకాశం ఇచ్చి ఇన్ని సినిమాలకు దర్శకత్వం చేసేలా ప్రోత్సహించేలా చేసింది కూడా ఆయనే.. అలాంటి రవికిషోర్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు త్రివిక్రమ్.. రామ్ హీరోగా నటించిన 'రెడ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళిన త్రివిక్రమ్.. నిర్మాత రవికిషోర్ గురించి మాట్లాడుతూ.. ఆయనకి పాదాభివందనం చేశారు.

తానూ మొదటగా రచయితగా పనిచేసిన 'స్వయంవరం' సినిమా మంచి హిట్టయినప్పటికీ అవకాశాలు పెద్దగా రాకపోవడంతో భీమవరం వెళ్లిపోయి అక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నానని, ఆ సమయంలో తనని హైదరాబాద్‌కు పిలిపించి 'నువ్వే కావాలి' సినిమాకు డైలాగ్స్ రాయించారని, అందులో ఫలానా డైలాగ్ ఎంత బాగుందో అర్ధరాత్రి చదివి వినిపించేవారని, అవి నన్ను ఎంతో సంతోషపరిచాయని అన్నారు.

అలాంటి రవికిషోర్ తో నాలుగు సినిమాలు పనిచేసే అదృష్టం తనకి మొదట్లోనే దక్కాయని అన్నారు త్రివిక్రమ్. ఇలాంటి వ్యక్తికి మరిన్ని విజయాలు రావాలని, మరింత మందిని ముందుండి నడిపించాలని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని త్రివిక్రమ్ ఎమోషనల్ అయ్యారు

Tags

Read MoreRead Less
Next Story