Bullet Song: తొలిసారి స్టెప్పేసిన సీనియర్ డైరెక్టర్.. బుల్లెట్ పాట క్రేజ్ అదిరిందిగా!

Bullet Song: తొలిసారి స్టెప్పేసిన సీనియర్ డైరెక్టర్.. బుల్లెట్ పాట క్రేజ్ అదిరిందిగా!
Bullet Song: తాజాగా బుల్లెట్ సాంగ్ లిరికల్ వీడియోకు 100 మిలియన్ల వ్యూస్ దక్కాయి.

Bullet Song:కొన్ని పాటలు రిలీజ్ అయినప్పుడు మామూలుగానే అనిపించినా.. ఆ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. చాలామందికి ఫేవరెట్ అయిపోతాయి. ఇక సోషల్ మీడియా అనేది ఊపందుకున్న తర్వాత సెన్సేషన్ అయిన పాటపై రీల్స్ చేయడం కూడా మొదలుపెట్టేశారు. తాజాగా రామ్ నటించిన 'ది వారియర్' చిత్రంలోని బుల్లెట్ పాటకు ఓ సీనియర్ డైరెక్టర్ మొదటిసారి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రామ్, కృతి శెట్టి జంటగా వస్తున్న చిత్రమే 'ది వారియర్'. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. అందుకే ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. అయితే ముందుగా ది వారియర్ నుండి బుల్లెట్ సాంగ్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. విడుదలయినప్పుడు పాటకు అంతగా పాపులారిటీ అందకపోయినా మెల్లగా ఒక్కొక్కరు పాటలోని స్టెప్పులతో రీల్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో పాటకు ఓ రేంజ్‌లో క్రేజ్ వచ్చింది.

తాజాగా బుల్లెట్ సాంగ్ లిరికల్ వీడియోకు 100 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఈ సందర్భంగా సీనియర్ డైరెక్టర్ భారతీరాజాతో స్టెప్పులేయించారు లింగుసామి. ఇద్దరూ కలిసి బుల్లెట్ పాటకు స్టెప్పులేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. 'ఈ సంతోషాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్' అంటూ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లింగుసామి.

Tags

Read MoreRead Less
Next Story