Yashoda Movie: 'యశోద' కోసం సమంత రిస్క్.. బయటపెట్టిన డైరెక్టర్స్..

Yashoda Movie: సమంత ప్రస్తుతం సౌత్‌లోని బిజీ హీరోయిన్స్‌లో ఒకరు. కేవలం సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా సమంత కోసం స్టార్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ తాను మాత్రం తొందరపడకుండా ఆలోచించి అడుగేస్తోంది సామ్. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడంలో తాను బిజీగా ఉంది. ఇటీవల తను నటిస్తు్న్న 'యశోద' మూవీ నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
యశోద సినిమా ఆగస్టులో విడుదలను ఖరారు చేసుకుంది. దీంతో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. దీంతో టాకీ పార్ట్ పూర్తయ్యిందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి హరీ, హరీష్ దర్శకత్వం వహిస్తుండగా.. టాకీ పార్ట్ పూర్తయిన సందర్భంగా యశోద విశేషాలను వారు ప్రేక్షకులతో పంచుకున్నారు.
'యశోద ఒక పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఆ బాధ్యతను భుజాలపై మోసే నటి కావాలనుకున్నాం. సమంతనే ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నాం, కథ చెప్పిన వెంటనే తాను కూడా ఓకే చేసింది. డూప్‌కు నో చెప్పి.. రిస్కీ్ స్టంట్స్ అన్ని సమంతనే స్వయంగా చేసింది. యాక్షన్ సీన్స్‌లో నటించే ముందు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చేది' అన్నారు హరీ, హరీష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com