Divyansha Kaushik: రవితేజ, నాగచైతన్యలో అదే కామన్: దివ్యాంశా కౌశిక్

Divyansha Kaushik: కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాకే స్టార్‌డమ్‌ను సంపాదించుకొని బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అయిపోతారు. కానీ కొందరికి మాత్రం ఫస్ట్ సినిమా హిట్ అయినా కూడా లక్ అంతగా కలిసిరాకపోవడమో, లేక ఇతర ఏదైనా కారణల వల్లనో ఎక్కువగా అవకాశాలు రావు. యంగ్ బ్యూటీ దివ్యాంశా కౌశిక్ కూడా ఇదే కేటగిరికి చెందుతుంది. ఇటీవల ఈ భామ ఇద్దరు హీరోలను పోలుస్తూ కామెంట్లు చేసింది.
నాగచైతన్య హీరోగా నటించిన 'మజిలీ' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది దివ్యాంశా కౌశిక్. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అందులో సెకండ్ హీరోయిన్‌గా నటించినా కూడా దివ్యాంశాకు బాగానే పేరొచ్చింది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. ఇప్పుడు మరోసారి మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ'తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది.
రవితేజ, దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్ ముఖ్య పాత్రలు పోషించిన రామారావు ఆన్ డ్యూటీ.. జులై 29న విడుదలకు సిద్ధమయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దివ్యాంశా.. నాగచైతన్యకు, రవితేజకు ఓ పోలిక ఉందని చెప్పుకొచ్చింది. సెట్స్‌లో ఇద్దరూ సరదా ఫ్రాంక్స్ చేస్తుంటారని తెలిపింది. రామారావు ఆన్ డ్యూటీలో నందినీ పాత్రను చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది దివ్యాంశా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com