DJ Tillu 2: 'డీజే టిల్లు'కు సీక్వెల్.. నిర్మాత ఇన్‌డైరెక్ట్ ట్వీట్..

DJ Tillu 2: ఈమధ్యకాలంలో యూత్‌ను ఆకర్షించడం కోసం ఎక్కువగా యంగ్ హీరోలు ముందుకొస్తున్నారు. కమర్షియల్ సినిమాలాగా కనిపించాలి కానీ యూత్‌కు కనెక్ట్ అవ్వాలి అనే కాన్సెప్ట్‌తో కథలను ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి యంగ్ హీరోలలో సిద్ధు జొన్నలగొడ్డ కూడా ఒకరు. ఇటీవల 'డీజే టిల్లు'తో సంచలనం సృష్టించిన సిద్ధు.. త్వరలోనే ఆ సినిమాకు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.
డీజే టిల్లులో సిద్ధు హీరోగా మాత్రమే కాకుండా రైటర్‌గా కూడా వ్యవహరించాడు. ఈ సినిమాకి కథతో పాటు మాటలు కూడా తానే సమకూర్చాడు. డీజే టిల్లు హిట్ తర్వాత సిద్ధును వెతుక్కుంటూ చాలా ఆఫర్లు వస్తున్నాయి. అందులో కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. కానీ ఏమైందో తెలియదు.. ఉన్నట్టుండి అన్నింటి నుండి తప్పుకున్నాడు. దీనికి కారణం డీజే టిల్లు సీక్వెల్ అని ప్రచారం సాగుతోంది.
డీజే టిల్లు సీక్వెల్‌కు కథ పూర్తి చేయడం కోసమే సిద్ధు.. మిగతా ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీ నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌తో ఇది నిజమే అని తెలుస్తోంది. 'ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీ.. రెండో రౌండ్‌కు సిద్ధమవుతోంది. ఆగస్ట్ నుండి షూటింగ్ ప్రారంభం కానుంది' అని ట్వీట్ చేశాడు నాగవంశీ. కానీ ఇందులో ఎక్కడా డీజే టిల్లు పేరు చెప్పకపోయినా.. ప్రేక్షకులు మాత్రం ఇది ఆ సినిమా సీక్వెలే అని బలంగా నమ్ముతున్నారు.
The most awaited Franchise... Gearing up for Round 2 🔥
— Naga Vamsi (@vamsi84) June 25, 2022
Crazy adventure starts filming in August! 🤩 pic.twitter.com/JX130Z4fpZ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com