'అంతేగా అంతేగా'.. ఈ నటుడు ఒకప్పుడు మంచి రొమాంటిక్ హీరో అని మీకు తెలుసా?

అంతేగా అంతేగా.. ఈ నటుడు ఒకప్పుడు మంచి రొమాంటిక్ హీరో అని మీకు తెలుసా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్2.. ఫ్యామిలీ, కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్2.. ఫ్యామిలీ, కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో అంతేగా అంతేగా అనే డైలాగ్ వీపరితంగా వైరల్ అయిపోయింది. ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరో కాదు అలనాటి హీరో ప్రదీప్.


ప్రదీప్ ఎవరో కాదు.. హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్దమందారం సినిమాలో హీరో ఇతనే. ప్రదీప్, పూర్ణిమ హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం 1981లో విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. ఇందులోని పాటలు ఇప్పటికి కూడా ఫేమస్ అనే చెప్పాలి. ముఖ్యంగా అలివేలు ఆణి ముత్యమా అనే రొమాంటిక్ సాంగ్ ఎవర్ గ్రీన్.


ఈ సినిమా తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే నాలుగు స్తంభాలాట, రెండు జెళ్ళ సీత అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఇక బుల్లితెర పై కూడా నటించాడు. కొన్ని సీరియల్స్ కి దర్శకత్వం కూడా వహించారు. ఇక ఎఫ్2 చిత్రం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. 1988లో సరస్వతిని పెళ్లి చేసుకున్న ప్రదీప్ కి ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నారు.Tags

Read MoreRead Less
Next Story