నటి ఊహ మేనమామ ఓ లెజండరీ నటుడే.. ఎవరో తెలుసా?

నటి ఊహ మేనమామ ఓ లెజండరీ నటుడే.. ఎవరో తెలుసా?
శ్రీకాంత్ హీరోగా నటించిన 'ఆమె' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన ఊహ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఊహకి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం..

శ్రీకాంత్ హీరోగా నటించిన 'ఆమె' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన ఊహ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఊహకి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.. నిజానికి ఊహ అసలు పేరు శివరంజని.. ఆమె సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఆమె పేరును ఊహాగా మార్చారు. అయితే ఈ సినిమాలో కలిసి నటించిన శ్రీకాంత్, ఊహ వీరిద్దరూ కొన్ని రోజుల తరవాత ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు.

కన్నడ సినిమా హృదయ సామ్రాజ్య సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది ఊహ. ఆ తర్వాత మలయాళం, తమిళ్ భాషల్లో నటిస్తూ వచ్చింది. 1994లో తెలుగులో దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఆమె సినిమాతో ఊహకి హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో ఆమెకి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆయనకి ఇద్దరు, ఊహ, ఆయనగారు మొదలగు సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. శ్రీకాంత్ తో పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉంది ఊహ.

ఇక ఇదిలావుండగా ఊహ మేనమామ కూడా సినీ నటుడే కావడం విశేషం. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. ఊహ మేనమామ ఎవరో కాదు. పి.ఎల్. నారాయణ.. అయన అసలు పేరు పుదుక్కోటై లక్ష్మీనారాయణ.. ఈయన సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా, రంగస్థల నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక సినిమాల్లోకి వచ్చాక ఎక్కువగా సహాయ పాత్రలు చేశారు.

1992 లో యజ్ఞం అనే సినిమాలో అప్పలనాయుడుగా నటించారు. ఇందులోని అయన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు దక్కాయి. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఎన్నో విలక్షమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అయన 1998 సంవత్సరం, నవంబరు 3 న తన అరవై మూడో ఏట మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story