RRR నుంచి 'దోస్తీ' సాంగ్ వచ్చేసింది..!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాని దోస్తీ' అనే సాంగ్‌ని చిత్రబృందం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పాట ప్రతిఒక్కర్నీ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్టుగా తెలుస్తోంది. కీరవాణి సంగీత సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళం), యాజిన్ నైజర్ (కన్నడ), విజయ్ ఏసుదాస్ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com