ఫ్లాట్‌లో రకుల్ డ్రగ్స్ దాచిపెట్టినట్లు విచారణలో అంగీరించిందని ప్రచారం

ఫ్లాట్‌లో రకుల్ డ్రగ్స్ దాచిపెట్టినట్లు విచారణలో అంగీరించిందని ప్రచారం
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ఎన్‌సీబీ విచారణకు హాజరైంది. ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఎన్‌సీబీ విచారణ ముగిసింది. తొలి రోజు ఆమెను ఐదు గంటల పాటు ఎన్‌సీబీ అధికారులు విచారించారు. మేనేజర్ కరిష్మాతో జరిగిన చాటింగ్‌పై దీపికాను ఎన్‌సీబీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్‌సీబీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు సమాచారం. కరిష్మాతో చాటింగ్ చేసినట్లు ఎన్‌సీబీ విచారణలో దీపిక ఒప్పుకుంది. కరిష్మాతో డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి సంభాషణలు జరపలేదని ఆమె చెప్పినట్లు తెలిసింది. దీపిక సమాధానాలు సంతృప్తికరంగా లేవని భావించిన ఎన్‌సీబీ అధికారులు ఆదివారం కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

శనివారం దీపికతో పాటు శ్రద్ధాకపూర్ కూడా ఎన్‌సీబీ విచారణకు హాజరయింది. శ్రద్ధాను ఎన్‌సీబీకి చెందిన మరో బృందం విచారించింది. ఎన్‌సీబీ విచారణలో తాను డ్రగ్స్ తీసుకోలేదని శ్రద్ధా చెప్పినట్లు తెలిసింది. జయ సాహాతో చాటింగ్ గురించి ఎన్‌సీబీ శ్రద్ధాను ప్రశ్నించినట్లు సమాచారం. సారా అలీఖాన్ కూడా శనివారం ఎన్‌సీబీ విచారణకు హాజరయింది.

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఎన్‌సీబీ విచారణకు శుక్రవారం హాజరైంది. ఈ విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. తానెప్పుడూ డ్రగ్స్ సేవించలేదని, `డ్రగ్ చాట్` మాత్రం చేశానని రకుల్ అంగీకరించిందని తెలుస్తోంది. రియాతో డ్రగ్స్ గురించి మాట్లాడినట్టు.. రియా కోరిన మేరకు తన ఫ్లాట్‌లో డ్రగ్స్ దాచినట్టు రకుల్ అంగీకరించిందని ముంబైలో వార్తలు వెలువడుతున్నాయి.

రకుల్ నిజంగా ఈ విషయం అంగీకరించినట్టయితే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్‌ను దాచడం పెద్ద నేరమని నిపుణులు చెబుతున్నారు. రకుల్ స్టేట్‌మెంట్ ఇవ్వడం నిజమైతే ఆమె అరెస్ట్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రగ్స్ వాడడం కంటే దాచడం పెద్ద నేరమని పేర్కొన్నారు. రకుల్ ముంబై వెళ్లినప్పుడల్లా రియాతోనే కలిసి ఉండేదని.. ఆమెతో కలిసి పార్టీలు.. పబ్బులకు వెళ్లేదని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story